Big B Special Note on Kalki 2898 AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’ కేవలం 17 రోజుల్లోనే రూ 1000 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం పట్ల ఇప్పటికే ప్రభాస్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడంపై బిగ్ బీ అమితాబ్ వీడియో రూపంలో ఆనందం వ్యక్తంచేశారు.
‘కల్కి’ ఇంతటి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు. ఒక మూవీ రూ.1000 కోట్లు సాధించడం అనేది ప్రభాస్‌కు సాధరణ విషయం అవ్వవచ్చు. కానీ నాకు ఇదే మొదటిది. రూ.1000 కోట్ల మూవీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను 4 సార్లు చూశాను. కల్కి నుంచి చాలా నేర్చుకున్నాను.. నాకు కావాల్సిన వాళ్లందరినీ థియేటర్‌కు పిలిపించుకుని మరి సినిమా చూపించాను. చాలా ఆనందంగా ఉందని అమితాబ్ చెప్పుకోచ్చాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)