‘కన్నప్ప’ టీజర్‌ను ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ .. మంచు విష్ణు .. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మొదటగా 'కన్నప్ప' ఆఫర్ నా వద్దకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను.

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్ర‌భాస్‌,మోహ‌న్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు

కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. 'కన్నప్ప' కథ చాలా శక్తివంతమైంది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఉంటాయి. విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అని అన్నారు.ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ దృష్టిని ఆకర్షించిన ఈ 'కన్నప్ప' టీజర్, మార్చి 1న అందరి ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది"అని అన్నారు.

Akshay Kumar, Vishnu Manchu Reveal Kannappa Teaser Ahead of Public Launch

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)