ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప(Kannappa). ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది కన్నప్ప. ఇప్పటికే ప్రతీ సోమవారం సినిమా నుండి అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు విష్ణు.

తాజాగా ఇవాళ సెకండ్ టీజర్‌ని(Kannappa Teaser 2) రిలీజ్ చేశారు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇక టీజర్ చివరలో ప్రభాస్‌ను చూపించిన విధానం టీజర్‌కే హైలైట్. తమ గూడెంల మీద శత్రు సైన్యం దండెత్తి వస్తున్న సమయంలో వారిని కాపాడే నాస్తికుడు అయిన తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, లివర్ సిర్రోసిస్ వ్యాధితో ప్రముఖ నటుడు ఉత్త‌మ్ మొహంతీ మృతి, సంతాపం తెలిపిన ఒడిషా సీఎం మాంఝీ

అక్షయ్ కుమార్ మహాశివునిగా, కాజల్ పార్వతిగా అద్భుతంగా కనిపిస్తుండగా వారిపై డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయని చెప్పవచ్చు. మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ అందరినీ టీజర్ లో చూపించారు.టీజర్ ఎండింగ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చేలా కట్ చేయడం మరింత హైప్ తీసుకొచ్చింది.

 Kannappa High Voltage Official Teaser-2 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)