సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా న‌టుడు ఉత్త‌మ్ మొహంతీ (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో క‌న్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27 రాత్రి క‌న్నుమూశారు. 1977లో అభిమాన్ (Abhiman) చిత్రంతో ఒడియా సిని ప‌రిశ్ర‌మ‌లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1980, 90 దశకం‌లో ఉత్త‌మ్ మొహంతీ అగ్రన‌టుడిగా ఒక వెలుగు వెలిగారు. త‌న 50 ఏండ్ల సినీ కెరీర్‌లో దాదాపు 135కి పైగా సినిమాల్లో న‌టించారు. ఇందులో ఒడియాతో పాటు బెంగాలీ, హిందీ చిత్రాలు ఉన్నాయి. మొహంతీ భార్య అపరాజితతో పాటు అత‌డి కుమారుడు బాబుషాన్ కూడా ఒడియా సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ నటులు.ఉత్తమ్ మొహంతీ మ‌ర‌ణ‌వార్త‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మోహన్ చరణ్ మాఝీ స్పందిస్తూ.. ఉత్తమ్ మొహంతీ మ‌ర‌ణం ఒడియా కళా ప్రపంచానికి తీరని నష్టం అంటూ అభివర్ణించారు. మ‌రోవైపు ఉత్త‌మ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది.

సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

CM Mohan Charan Majhi. Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)