బాలాసోర్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కు పోయింది.
అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (New Delhi-Bhubaneswar Rajdhani Express) వచ్చింది. ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.ఘటన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
IANS News
The #Delhi-Bhubaneswar Rajdhani Express had a narrow escape after it brushed past a tractor-loaded with diesel barrels, which had got stuck on the tracks close to a manned-railway crossing near the Santaldih station, in #WestBengal's Purulia district. pic.twitter.com/Mx1ShAUCG1
— IANS (@ians_india) June 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)