
Hyderabad, Feb 28: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం (Actress Jayaprada's brother passed away) నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని తన నివాసంలో రాజబాబు (Rajababu) గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ వార్త తనకు ఎంతో కలచివేసిందని జయప్రద భావోద్వేగంగా పేర్కొన్నారు. తన జీవిత ప్రయాణంలో అన్నగా, సహాయంగా నిలిచిన ఓ మంచి సోదరుడిని కోల్పోవడం తనకు తీరని లోటని ఆమె వెల్లడించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు రాజబాబు అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
జయప్రద పోస్ట్ లో ఏమన్నారంటే?
"నా అన్నయ్య రాజబాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం 3.26 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో పంచుకుంటాం" అని తన ఇన్‌స్టా పోస్టులో జయప్రద పేర్కొన్నారు.
View this post on Instagram
నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత
హైదరాబాద్ లో ని తన నివాసంలో అనారోగ్యంతో మృతి pic.twitter.com/3NLhYakwQz
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2025
పలువురి సంతాపం
రాజబాబు అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జయప్రద సోదరుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయన పలువురికి పరిచయమున్నవారని, ఆయన లేరనే వార్తను నమ్మలేకపోతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.