Ramuloo Ramulaa: అల వైకుంఠపురములో 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో, రాములో రాములా నా పాణం తీసిందిరో' మరో క్రేజీ సాంగ్ టీజర్ రిలీజ్, ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..' అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో సాగే ఆ పాటకు ఎవరి వెర్షన్‌లో వారు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త సాంగ్ రిలీజైన తర్వాత దీని క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి...

Ramuloo Ramulaa: అల వైకుంఠపురములో 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో, రాములో రాములా నా పాణం తీసిందిరో' మరో క్రేజీ సాంగ్ టీజర్ రిలీజ్, ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Ramuloo Ramulaa Song Teaser | Photo Credits: Aditya Music

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మూవీ 'అల వైకుంఠపురములో..' (Ala Vaikunthapurramuloo) నుంచి 'రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో' (Ramuloo Ramulaa Song) అనే ఎనర్జిటిక్  నెంబర్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.

అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే జంటగా వచ్చిన 'అల వైకుంఠపురములో'  సినిమా సంక్రాతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.  ఈ సినిమాలోని పాటలకైతే ఇప్పటికీ క్రేజ్ ఉంది. రాములో.. రాములా, సామజవరగమన , బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గతవారమే ఈ సినిమాలోని బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయగా, ఈరోజు మాస్ బీట్ 'రాములో రాములా' ఫుల్ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు.

ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి స్టెప్స్,  మాస్- క్లాస్ లుక్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. హీరో సుశాంత్ కూడా ఈ పాటలో తన డాన్స్ టాలెంట్ చూపించాడు. తమిళ హీరోయిన్ నివేథ పేతురాజ్ గ్లామర్, సీనియర్ యాక్ట్రెస్ టబు లాంటి స్టార్లతో ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంటుంది.

Ramuloo Ramulaa Full Video Song: 

'అల వెంకఠపురములో' , జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం కాగా, దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత పూజ హెగ్డే రెండో సారి ఈ సినిమాలో బన్నీతో కలిసి రొమాన్స్ చేసింది.  రాములో రాములాను దోశ స్టెప్‌గా మార్చేసిన బన్నీ లిటిల్ ప్రిన్సెస్స్ అర్హ

గొప్పింట్లో పెరగాల్సిన ఒక అబ్బాయి, దేనికి నోచుకొని మిడిల్ క్లాస్ ఇంట్లో, అలాగే మిడిల్ క్లాస్ ఇంట్లో పెరగాల్సిన అబ్బాయి రాజకుమారుడిలా అత్యంత విలాసవంతమైన జీవితంలో పెరిగితే, వారి కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తికరమైన కాన్సెప్టుతో, ఆసక్తికరమైన కథనంతో  త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కించారు.

(The above story first appeared on LatestLY on Mar 03, 2020 06:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).