Dosa step comparison between Allu Arjun & Arha | Photo: Geetha Arts

మన ఫేవరెట్ సినిమా స్టార్స్ ఆన్ స్క్రీన్ మీదే కాదు, వారు ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారు, వారి ఫ్యామిలీ విశేషాలు కూడా మనకు చాలా ఇంటరెస్టింగా అనిపిస్తాయి. మహేశ్ బాబు కూతురు సితార, బన్నీ కూతురు అర్హ తమ స్టార్ డాడీల గురించి ఏదైనా చెప్తూ లేదా డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినపుడు అవి సూపర్ వైరల్ అయిపోతాయి. వారి క్యూట్ మాటలు, వీడియోలకు లక్షలు పోసి చేఏ ప్రమోషన్స్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ వస్తాయి.

ఇక అసలు విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురములో' ( Ala Vaikunthapurramuloo) మూవీ రిలీజ్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. రాములో.. రాములా (Ramulo.. Ramulaa) సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. అల్లు అర్జున్ డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటలో 'హాఫ్ కోట్ స్టెప్' (#Half Coat Step) అని ఒకటి ఉంది. కానీ అది నిజానికి 'దోశ స్టెప్' (Dosa Step) అంట. ఇది చెప్పింది ఎవరో కాదు బన్నీ లిటిల్ ప్రిన్సెస్ అర్హానే (Arjun + Sneha = ArHa) .

కావాలంటే ఈ వీడియో చూడండి.

Arha about Dosa Step- Oh My Arha: 

 

View this post on Instagram

 

Dosa step 😂#alavaikunthapurramuloo @alluarjunonline

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

పాపం అర్హ, వాళ్ల డాడీ ఇంట్లో ఎప్పుడైనా దోశలు వేసేటపుడు చూసిందేమో. అందుకే ఆ సాంగ్ చూసి వాళ్ల డాడీ కూడా అక్కడ దోశలు వేస్తున్నాడని అనుకుంది. సినిమా వాళ్లకు, ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కు అది దోశ స్టెప్ అని తెలియక హాఫ్ కోట్ స్టెప్ అని పెట్టి ఉంటారు. అయినా శేఖర్ మాస్టర్ ఎన్ని దోశలు వేసుంటే అలాంటి స్టెప్ కంపోజ్ చేసి ఉండాలి?

Watch Ramulo.. Ramula all over again!

;

ఈ సినిమాకు సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న అల వైకుంఠపురములో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా జనవరి 06న హైదరాబాద్, యూసుఫ్ గూడలో గల పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు.

Music Concert Update:

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. సుశాంత్, నిహారిక, నవదీప్, టబు తదితరులు కూడా నటించారు. మ్యూజిక్ థమన్ ఎస్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.