Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Hyderabad, Sep 22: లైంగిక వేధింపుల కేసులో (Rape Case) అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై (Jani Master) తెలుగు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి జానీ వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడు. ఆ షూటింగ్‌లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు!. సుకుమార్ దానికి పంచాయితీ పెట్టి క్లియర్ చేశాడు. ఈ విషయం అల్లు అర్జున్‌కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి బన్నీ అండగా నిలబడ్డాడు. రీసెంట్‌గా విశ్వక్‌సేన్ మూవీలో కూడా అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేశాడు’ అని మాధవీలత తెలిపారు.
Here's Video:
ఆమెను అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో ఉండగా జానీ మాస్టర్ కొట్టాడు!
పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్, విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్లో ఉండగా ఆ మహిళా కోరియోగ్రఫర్ను జానీ మాస్టర్ కొట్టాడు - మాధవీ లత pic.twitter.com/FSJYkjJJK7
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2024
నాగబాబుపై ఫైర్
జానీ మాస్టర్ కి సపోర్టింగ్ వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు, నిర్మాత, నటుడు నాగబాబుపై కూడా మాధవీలత విరుచుకుపడ్డారు. ‘నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది. మీరు ఇలా మాట్లాడటం సరికాదు. మీ అమ్మాయి కంటే చిన్నపిల్ల ఇంకా ఆ అమ్మాయి. జానీ అనే వాడు మీ వరకు మంచి వ్యక్తి కావచ్చు కానీ ఆ అమ్మాయి విషయంకు వచ్చేసరికి మంచి వ్యక్తి కాడు. సాక్ష్యంగా నేనున్నా’ అన్నారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!
(The above story first appeared on LatestLY on Sep 22, 2024 11:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

