Pragya Jaiswal Covid: ప్రముఖ తెలుగు హీరోయిన్‌కు మళ్లీ కరోనా, వ్యాక్సిన్ వేసుకున్నా రెండో సారి కోవిడ్ వచ్చిందంటూ ట్వీట్ చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్‌

ప్రముఖ తెలుగు హీరోయిన్‌ ప్ర‌గ్యా జైస్వాల్‌ (pragya jaiswal) మరోసారి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (actress pragya jaiswal tested covid 19) అయ్యాను.

Pragya Jaiswal Covid: ప్రముఖ తెలుగు హీరోయిన్‌కు మళ్లీ కరోనా, వ్యాక్సిన్ వేసుకున్నా రెండో సారి కోవిడ్ వచ్చిందంటూ ట్వీట్ చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్‌
Pragya Jaiswal (Photo Credits: Instagram)

ప్రముఖ తెలుగు హీరోయిన్‌ ప్ర‌గ్యా జైస్వాల్‌ (pragya jaiswal) మరోసారి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (actress pragya jaiswal tested covid 19) అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఇంత‌క‌ముందు క‌రోనా బారిన ప‌డ్డాను. ఇప్పడు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చింది .ప్ర‌స్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన అఖండ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మగాళ్లను ఎందుకు ప్రశ్నించరు, నాపై ఎందుకు అంతలా దాడి చేస్తున్నారు, ద‌య‌చేసి నన్ను ఒంట‌రిగా వ‌దిలేయండి, చైతన్యతో విడిపోయిన తరువాత సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టిన సమంత

ఇదిలా ఉంటే.. ప్రగ్యాజైస్వాల్ కరోనా బారిన పడడంతో అఖండ చిత్రయూనిట్ ఒక్కసారిగా షాకయ్యింది. ఇటీవలే షూటింగ్‏లో పాల్గోన్న ప్రగ్యా జైస్వాల్ ఇలా ఆకస్మాత్తుగా కోవిడ్ బారిన పడడంతో చిత్రయూనిట్ సందేహంలో పడిపోయినట్లుగా తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

ఇటీవల ఆఖండ మూవీ షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర బృందం సెలబ్రెషన్స్‌ చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె హీరో బాలకృష్ణతో పాటు పలువురితో సన్నిహితంగా మెలిగింది. అంతేగాక బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ​

(The above story first appeared on LatestLY on Oct 10, 2021 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).