Samantha Shares Cryptic Post: మగాళ్లను ఎందుకు ప్రశ్నించరు, నాపై ఎందుకు అంతలా దాడి చేస్తున్నారు, ద‌య‌చేసి నన్ను ఒంట‌రిగా వ‌దిలేయండి, చైతన్యతో విడిపోయిన తరువాత సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టిన సమంత
Naga Chaitanya-Samantha Divorce

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్ విష‌యం గురించే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తుంది. సమంతను టార్గెట్ చేస్తూ కొందరు, చైతన్యను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు (Questions Society For Judging Women) అనే కామెంట్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.

స‌మంత తాజాగా త‌న మ‌న‌సులోని బాధ‌ను బ‌హిర్గ‌తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ (Samantha Shares Cryptic Post) షేర్ చేసింది. మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఉండే స‌మాజం, మ‌గ‌ళ‌వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు. అంటే మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టేనా అని గుడ్ మార్నింగ్ చెబుతూ కొటేష‌న్ పెట్టింది. చైతూ నుండి దూర‌మయ్యాక స‌మంత లోలోప‌ల చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.

ఇక త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు స‌మాధానంగా సోష‌ల్ మీడియా ద్వారా సమంత సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టింది. వ్య‌క్తిగ‌త సంక్షోభంలో మీ భావోద్వేగ వ్యాఖ్య‌లు, నాపై చూపిన సానుభూతి, నా విష‌యం ప‌ట్ల వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌, త‌ప్పుడు పుకార్లు, క‌థ‌నాల నుండి ర‌క్షించినందుకు మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. కొంద‌రు నాకు ఎఫైర్స్ ఉన్నాయంటున్నారు. పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంటున్నానని చెబుతున్నారు. నేను అవ‌కాశవాదిన‌ని అంటున్నారు. ఇప్పుడేమో అబార్ష‌న్ (Abortion) చేయించుకున్నాన‌ని అంటున్నారు. విడాకుల ప్ర‌క్రియ అనేది వ్య‌క్తిగ‌తంగా చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నన్ను ద‌య‌చేసి ఒంట‌రిగా వ‌దిలేయండి. క‌నిక‌రం లేకుండా వ్య‌క్తిగ‌తంగా నాపై దాడి చేస్తున్నారు. నేను ఇలాంటి విష‌యాన్ని అనుమ‌తించ‌ను..అంటూ పోస్టులో చెప్పుకొచ్చింది.

ఎవరి దారి వారిదే ఇక, విడాకులు తీసుకున్న సమంత-నాగ చైతన్య, విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని వెల్లడి

విడాకుల త‌ర్వాత స‌మంత త‌న ఆవేద‌నను చెబుతూ పెట్టిన ఈ పోస్టు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మా శ్రేయోభిలాషుల‌కు చెప్తున్న‌దేమంటే.. చాలా చ‌ర్చ‌ల త‌ర్వాత చైత‌న్య‌, నేను భార్యాభ‌ర్త‌లుగా విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా సొంత మార్గాల్లో వెళ్లాల‌నుకుంటున్నాం. ద‌శాబ్దానికిపైగా మా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉండ‌టం చాలా అదృష్ణం. మా ఇద్ద‌రి రిలేష‌న్ షిప్‌లో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని న‌మ్ముతున్నాం. మా అంద‌రికీ మీ మ‌ద్ద‌తుంటుంద‌ని ఆశిస్తున్నామంటూ విడిపోతున్న సంద‌ర్భంగా సమంత పోస్ట్ పెట్టింది.

పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ అనే తమిళ సినిమా చేస్తోంది సమంత.

ఇక స‌మంత‌తో శాకుంత‌లం సినిమా చేసిన నిర్మాత నీలిమ గుణ షాకింగ్‌ విషయాలను వెల్లడిచింది. మా నాన్న( గుణ‌శేఖ‌ర్‌) శాకుంత‌లం సినిమా కోసం సమంత‌ని సంప్ర‌దించ‌గా, ఆమె అప్ప‌టికే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామ‌ని కొన్ని రోజులు సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని స‌మంత పేర్కొంది. అయితే శాకుంతం క‌థ న‌చ్చ‌డంతో కొన్ని కండీష‌న్స్‌తో స‌మంత ఓకే చేసింది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం. స‌మంత శాకుంత‌లం త‌ర్వాత సినిమాలు చేయ‌న‌ని, పిల్ల‌ల్ని క‌నేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పింది. కానీ చైతూతో ఇలా విడిపోవ‌డం షాకింగ్‌గా ఉంద‌ని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నీలిమ స్ప‌ష్టం చేసింది.