Naga Chaitanya-Samantha Divorce

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య (Naga Chaitanya-Samantha Divorce) విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ (Samantha Akkineni and Naga Chaitanya Release a Joint Statement) ద్వారా ప్రకటించింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది.

మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ ఇద్దరూ ట్వీట్ చేశారు.

నువ్వు సైకోవి పవన్, రేపే నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, జనసేనాధినేతపై మండిపడిన పోసాని కృష్ణమురళి, టీడీపీ శ్రేణులు చిరంజీవిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు అంటూ ఫైర్ 

అక్కినేని కుటుంబం నుంచి నట వారసుడిగా ‘జోష్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగచైతన్య. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తండ్రి బాటలోనే ఓ మంచి రొమాంటిక్‌ లవ్‌స్టోరీ చేయాలనుకున్నారు. ఆ క్రమంలో పట్టాలెక్కిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ఈ సినిమా చైతూకు తొలి విజయాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఇందులో కథానాయికగా తెలుగు, తమిళ తెరకు సమంత పరిచయమైంది. ఈ చిత్రంలో పనిచేసేటప్పుడే సమంత, నాగచైతన్యల మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. ఒక పక్క తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే ప్రేమలోకంలో విహరించారు.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

ఇరు కుటుంబాలు సామ్‌-చైతూల పెళ్లికి ఓకే చెప్పడంతో జనవరి 29, 2017న వీరికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబరు 6న హిందూ వివాహ పద్ధతిలో, అక్టోబరు 7న క్రిస్టియన్‌ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. గోవాలో జరిగిన ఈ వేడుకలో బంధువులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు అక్టోబరు 2, 2021న సామాజిక మాధ్యమాల వేదికగా చై-సామ్‌లు ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

నాగచైతన్య-సమంత కలిసి ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో నటించారు ‘ఏమాయ చేసావె’ వారి తొలి చిత్రం కాగా, ‘మనం’, ‘ఆటోనగర్‌ సూర్య’ ‘మజిలీ’ చిత్రాల్లో కలిసి వెండితెరను పంచుకున్నారు. సమంత నటించిన ‘ఓ బేబీ’లో నాగచైతన్య అతిథి పాత్రలో మెరిశారు.