Anchor Suma's Son Roshan: యాంకర్ సుమ కొడుకు కొత్త లుక్ చూశారా..నెట్టింట్ వైరల్‌గా మారిన రోషన్ తాజా ఫోటోలు, బర్త్‌డే విషెస్ చెబుతూ ఈ ఫోటోలను షేర్ చేసిన యాంకర్ సుమ
తెలుగు చలన చిత్ర యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఆ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.
తెలుగు చలన చిత్ర యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఆ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్ (Anchor Suma's Son Roshan) మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తమ తనయుడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు.
తాజాగా రోషన్ ఫోటోలు నెట్టింట్ వైరల్‌గా ( Suma's son Roshan latest looks go viral) మారాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుమ.. రోషన్ బర్త్‌డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తమ కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అంశంపై ఏపీ సీఎంతో భేటీ అయిన దర్శకుడు రాజమౌళి
View this post on Instagram
అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
(The above story first appeared on LatestLY on Mar 16, 2022 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

