ఏపీ సీఎం జగన్ తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్నారు.సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఈ నెల 25న ప్రపంవచవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్, తదితర అంశాలపై జక్కన్న సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి, అందుకు ఏం చేయాలో అది చేస్తామని సీఎం జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజమౌళి వెల్లడించారు. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయంపై తెలుగు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేసిన విషయం విధితమే. పలువురు సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పారు.
సీఎం సానుకూలంగా స్పందించారు
సినీ దర్శకుడు రాజమౌళి pic.twitter.com/xcRwcjVOK6
— Ramu Sandipagu (@RSandipagu) March 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)