Credits: Twitter/Avatar2

Hyderabad, Dec 16: ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించి, జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన ‘అవతార్ 2’ (Avatar 2) ఆన్ లైన్ లో లీక్ (Leaked in Online) అయింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవతార్’ హాలీవుడ్ (Hollywood) లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

ఆసియా అందాల తారగా కత్రినా కైఫ్, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022ని విడుదల చేసిన గూగుల్

భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్నేళ్లకు ‘అవతార్ 2’ వస్తోంది. ‘ద వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ తో పాటు పలు భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోంది. భారత్ లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. అయితే, ఈ చిత్రం మరొక రోజులో థియేటర్లలో సందడి చేయనుందనగా.. చిత్రబృందానికి పైరసీదారులు షాకిచ్చారు.

సోనూసూద్ రైలు వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు, సినిమాల్లో ఒకే కాని నిజ జీవితంలో కాదు సోనూ అంటూ ముంబై రైల్వే పోలీసులు ట్వీట్, ఆ వీడియో ఇదే..

గురువారమే ఈ చిత్రాన్ని లీక్ చేశారు. మొత్తం చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. లండన్ లో ఈ నెల 6వ తేదీనే విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్ తో పాటు టోరెంట్ సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో, పలువురు దీన్ని డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లింక్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు.