Mumbai, Dec 15: బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కరోనాలో రియల్ హీరో అనిపించుకున్న సంగతి విదితమే. తాజాగా సోనూ సూద్ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.
‘కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం..’, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’, ‘ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’, ‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు పోస్టు చేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే సోనూసూద్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Here's Video
.@SonuSood travelling on the footboard may be a source of 'Entertainment' in movies, not real life! Let's follow all safety guidelines and ensure a 'Happy New Year' for all.
— GRP Mumbai (@grpmumbai) December 14, 2022
దీనిపై ముంబై రైల్వే పోలీసులు స్పందించారు. ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో 'వినోదం'కి మూలం కావచ్చు, నిజ జీవితంలో కాదు! అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి. అందరికీ 'హ్యాపీ న్యూ ఇయర్'ని అని తెలిపారు. సోనూసూద్ ని ట్యాచ్ చేస్తూ రైల్వే పోలీసులు స్పందించారు.