Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.
Hyd, Oct 6: బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.
ఈసారి కంటెస్టెంట్ల వివరాలను పరిశీలిస్తే తర్షిక పోని, తారిక, తిరుచ్చి శరవణ కుమార్,ఐశ్వర్య భాస్కరన్,వీజే విశాల్, గోకుల్నాథ్ అంబులి , వీటీవీ గణేష్, సౌందర్య నంజుండన్,దర్శ గుప్తా, సునీతా గొగోయ్, సచన నామిదాస్, అన్షిత అక్బర్షా తదితరులు ఈసారి కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?
ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభంకానుంగా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టీవీలో టెలీకాస్ట్ కానుంది.100 రోజుల పాటు ఈ షో జరగనుండగా ఈసారి భిన్నంగా తమిళ బిగ్ బాస్ షో ఉండనుంది. ఈసారి హౌస్‌ని రెండు భాగాలు విభజించారు. మగవారంతా ఒక వైపు,ఆడవారంతా మరోక వైపు ఉండేలా ప్లాన్ చేశారు. దీని ద్వారా షోకు మరింత రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా తమిళ బిగ్ బాస్ 8 గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 06, 2024 04:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

