Hyd, Oct 5: బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు వీకెండ్ ఎలిమినేషన్ జరుగగా ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు బిగ్ బాస్.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. స్టార్ మా రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో అయితే ఆదిత్య ఓం కనిపిస్తున్నారు కానీ.. ఆ తరువాత అంటే.. బుధవారం అర్థరాత్రి నాడే మిడ్ వీక్ ఎలిమినేషన్‌ని చేపట్టారు. గతంలో కూడా... ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌ని అర్థరాత్రి టైంలోనే చేపట్టేవారు. నిద్రలో ఉన్న వాళ్లందర్నీ లేపి.. ఎవరెవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో.. వాళ్లని నిలబెట్టి.. వాళ్లలో ఒకర్ని ఎలిమినేట్ చేసేవారు.
ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా నైనికా, ఆదిత్య ఓం మధ్య ఇంటి సభ్యులతో ఓటింగ్ జరుగగా అంతా ఆదిత్యను టార్గెట్ చేయడంతో ఇంటి నుండి బయటకు వెళ్లమని బిగ్ బాస్ చెప్పారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆదిత్య ఎలిమినేషన్‌పై క్లారిటీ రానుంది. వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు
వాస్తవానికి ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉందన్న విషయం తెలిసిందే. దీంతో అంతా నైనిక బయటకు వస్తుందని భావించినా ఆదిత్య ఎలిమినేట్ అయినట్లు తెలస్తోంది. ఇక వచ్చేవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే ఒకరిలో టేస్టి తేజా కన్ఫామ్ కాగా మరొకరి పేరు గంగవ్వగా తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ మా ఛానెల్‌లో ప్రతీరోజు రాత్రి 9.30 నుండి మరియు వీకెండ్‌లలో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.