Vidya Balan: ఆ నిర్మాత నా బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ప్రవర్తించాడు, ఆ దెబ్బకు 6 నెలలు అద్దంలో నన్ను నేను చూసుకునేందుకే భయపడ్డాను, షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విద్యాబాలన్
కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యాబాలన్ (Bollywood actress Vidya Balan) భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె తాజాగా నటించిన చిత్రం జల్సా ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యాబాలన్ (Bollywood actress Vidya Balan) భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడు.
అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను. ఇదంతా 2003లో జరిగింది. ఆ సమయంలో నేను ఏ సినిమాలకు సంతకం చేయలేకపోయాను. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు నాపై ప్రభావం చూపింది’ అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు పలు ప్రకటనల నుంచి కూడా తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది.
అదే బాధలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల (she was 'kicked out' of 13 films) నుంచి తీసివేశారని విద్యా బాలన్ తెలిపింది. ఆ తర్వాత అందమైన శరీరాకృతి కోసం రోజు గంటల తరబడి వ్యాయమం చేసి బరువు తగ్గాననని పేర్కొంది. ఇక ఇప్పడు నన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలే ఫోన్ చేసి సినిమా చేయాలని అడుగుతున్నారని, అయితే వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు విద్యా బాలన్ చెప్పింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకున్న విద్యా బాలన్ అప్పటి నుంచి వరస ఆఫర్లతో దూసుకుపోతోంది.
(The above story first appeared on LatestLY on Mar 18, 2022 02:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

