బాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోన్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్‌. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్‌ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది. కానీ క్యాప్షన్‌లో మాత్రం.. 'ఇకపై నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాల్సిందే, వేరే ఆప్షన్‌ లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నా' అని కొంటెగా రాసుకొచ్చింది. సన్నీ ఫ్యాన్స్‌ ఆమె మీద అభిమానాన్ని చూపించడం ఇదేం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ అభిమాని ఏకంగా ఆమె ముఖాన్ని తన పొట్టపై టాటూ వేయించుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)