Bhola Shankar First Single: భోళాశంకర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, మెగాస్థార్‌ మాస్‌ క్రేజ్‌కు తగ్గట్లు భోళా మ్యానియా సాంగ్‌
Chiranjeevi Bhola Shankar First Single (PIC@ Youtube)

Hyderabad, June 04: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ నుంచి అప్డేట్స్ రావడం మొదలయ్యాయి. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఆ సాంగ్ ప్రోమోని రెండు రోజుల క్రిందట రిలీజ్ చేశారు. తాజాగా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. భోళా మ్యానియా అంటూ సాగే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పక్కా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా అలరించేలా ఉంది. ఇక ఈ సాంగ్ లో చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది. చిరంజీవికి సిస్టర్ గా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తుంది. ఇక చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కనిపిస్తుంది.

Nikhil: హీరో నిఖిల్‌ కొత్త సినిమా లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే?? 

ఇటీవలే స్విట్జర్లాండ్‌లో చిరంజీవి, తమన్నా పై మూవీలోని డ్యూయెట్ సాంగ్ ని షూట్ చేశారు. కాగా హీరో సుశాంత్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. మూవీ షూటింగ్ కూడా దాదాపు మొత్తం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.