Shiva Shankar Master Health Update: విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, రంగంలోకి దిగిన సోనూసూద్, ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి, కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్
ప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ కరోనా బారీన (Choreographer Shiva Shankar critical with COVID-19) పడిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం (Shiva Shankar Master Health Update) విషమంగా ఉంది.
ప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ కరోనా బారీన (Choreographer Shiva Shankar critical with COVID-19) పడిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం (Shiva Shankar Master Health Update) విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood helping Shiva Shankar Master) సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడుతున్నాని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని ట్వీట్‌లో సోనూసూద్ పేర్కొన్నారు.
Here's sonu sood Tweet
Iam already in touch with the family,
Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl
— sonu sood (@SonuSood) November 25, 2021
శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.
(The above story first appeared on LatestLY on Nov 25, 2021 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

