Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని  కొట్టేశారంటున్న బండ్ల గణేశ్
Bandla Ganesh (Photo-Twitter)

Hyderabad, May 20: యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' (Devara) తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత తాను ఆ టైటిల్ గురించి మర్చిపోయానని, అందువల్లే తన టైటిల్ ను కొట్టేశారని ఆరోపించారు.

NTR30 First Look: దేవర ఫస్ట్ లుక్‌ రిలీజ్, ఎన్డీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే, జూనియర్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్‌రామ్

తనకేమీ సమస్య లేదని..

ఈ విషయంలో తనకేమీ సమస్య లేదని బండ్ల గణేశ్ తెలిపారు. ఇది మన యంగ్ టైగర్ సినిమానే కదా... ఆయన కూడా నాకు దేవరే అంటూ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ 30వ చిత్రం 'దేవర' పేరిట కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)ని పురస్కరించుకుని ఒకరోజు ముందే సినిమా టైటిల్ ను ప్రకటించారు.

PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో

(The above story first appeared on LatestLY on May 20, 2023 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).