Hyderabad, May 19: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR30. RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నేడు (మే 19) రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడం, టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
అయితే ఈ మూవీ టైటిల్ పై నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్ చేశాడు. దేవర టైటిల్ తనదని, తను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్ ని మర్చిపోవడం వల్ల ఇప్పుడు ఆ టైటిల్ ని కొట్టేశారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన మరో గంటకి.. “ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆల్రెడీ చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసేశారు. తాజాగా మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయి అని తెలుస్తుంది.