Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??
ఓటీటీ విడుదలకు 'సీతారామం' రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Hyderabad, September 5: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ప్రేమకథా దృశ్యకావ్యం చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
(The above story first appeared on LatestLY on Sep 05, 2022 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

