Producer T.R.Chandrashekhar: మత్తుకు బానిసై నా భార్య వేరేవాడితో తిరుగుతోంది, పోలీసులకు ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఫిర్యాదు, ఎదురు కేసు పెట్టిన భార్య నమిత

ప్రముఖ కన్నడ సినీ నిర్మాత టి చంద్రశేఖర్ తన భార్యపై పోలీసులకు చేశారు.మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్‌ భార్య నమిత, ఆమె స్నేహితుడు, పేరు మోసిన డ్రగ్ డీలర్ లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు

Producer T.R.Chandrashekhar: మత్తుకు బానిసై నా భార్య వేరేవాడితో తిరుగుతోంది, పోలీసులకు ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఫిర్యాదు, ఎదురు కేసు పెట్టిన భార్య నమిత
Drugs| Representational Image (Photo credits: stevepb/Pixabay)

Producer Chandrasekhar Files Complaint Against Wife: ప్రముఖ కన్నడ సినీ నిర్మాత టి చంద్రశేఖర్ తన భార్యపై  పోలీసులకు చేశారు.మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్‌ భార్య నమిత, ఆమె స్నేహితుడు, పేరు మోసిన డ్రగ్ డీలర్ లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు

చంద్రశేఖర్ బెంగళూరులోని చెన్నమ్మన కెరె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో, అతని భార్య ఫిర్యాదును తిరస్కరించింది. తన నిర్మాత భర్త తనపై నకిలీ అభియోగాలు మోపాడని ఆరోపించారు. డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీష్ ప్రభు ఒకసారి నిర్మాతపై దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ‘టైటానిక్‌’ నటుడు లేవ్‌ పాల్టర్‌ మృతి

రెండేళ్ల క్రితం చంద్రశేఖర్‌, నమితను పెళ్లాడారు.బనశంకరి సెకండ్‌ స్టేజీ లో నివాసం ఉంటున్నారు. నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిమాటలు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆమెకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న లక్ష్మీశ్‌ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటిలో ఇద్దరూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ప్రశ్నిస్తే నాపైనే దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, భర్త తనపై దాడి చేశాడని భార్య నమితా కూడా ఫిర్యాదు చేసింది. తనకు లక్ష్మీశ్‌ స్నేహితుడు మాత్రమేనని, భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు నమితా పేర్కొంది. అతని స్నేహితులు అరుణ్‌, హేమంత్‌లు తనపై చాకుతో దాడి చేసినట్లు, ఇంటిలో డ్రగ్స్‌ పెట్టి అరెస్ట్‌ చేయిస్తానంటూ బెదిరిస్తున్నట్లు నమిత ఫిర్యాదులో తెలిపింది. ఇరువైపుల ఫిర్యాదును తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 27, 2023 03:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).