A file image of Tollywood actor Akkineni Nagarjuna

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై టాలీవుడ్ కింగ్ స్పందించారు. తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి నాపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు నాగార్జున.

1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా, బిగ్ బాస్ షోలో ఈ అశ్లీలత ఏంటని ఘాటుగా ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

నాగార్జున మాట్లాడుతూ 'నేను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎలక్షన్ల సమయంలో ప్రతిసారి ఇలాంటి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తా' అని వివరణ ఇచ్చారు. కాగా.. నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది.