Kajal Aggarwal-Gautam Kitchlu Wedding: ముంబై వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ పెళ్లి, అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుతో పెళ్లి అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపిన ముద్దుగుమ్మ, అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న పెళ్లాడనున్నట్టు (Kajal Aggarwal-Gautam Kitchlu Wedding) కాజల్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు ట్వీట్ లో తెలిపింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ (Kajal Aggarwal) సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న పెళ్లాడనున్నట్టు (Kajal Aggarwal-Gautam Kitchlu Wedding) కాజల్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు ట్వీట్ లో తెలిపింది.
తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ (Kajal Aggarwal) సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని బ్యూటీ ఆకాక్షించింది. కొంతకాలంగా గౌతమ్ కిచ్లు, అగర్వాల్ మధ్య నడిచిన స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం.
టాలీవుడ్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించి అగ్ర స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పించారు. కాగా కాజల్ చెల్లి ఇషా అగర్వాల్ ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Oct 06, 2020 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

