James Cameron on RRR: దటీజ్ రాజమౌళి, RRR మూవీ రెండు సార్లు చూశానంటూ జక్కన్నను ప్రశంసల్లో ముంచెత్తిన అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్
ఆర్ఆర్ఆర్‌ను రెండుసార్లు చూశానని అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడంతో రాజమౌళి తెగ ఖుషీ అయిపోయారు. ఇక జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఆర్ఆర్ఆర్‌ను రెండుసార్లు చూశానని అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడంతో రాజమౌళి తెగ ఖుషీ అయిపోయారు. ఇక జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్లో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, హాలీవుడ్ దిగ్గజం, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య ఆసక్తికర ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడుతూ.. మీ సినిమాలు టైటానిక్, టర్మినేటర్‌తో పాటు అవతార్-2 చూశానని తెలిపారు. మీరే నాకు ఆదర్శమని కామెరూన్‌ను కొనియాడారు. మీ ప్రశంసలు అవార్డ్ కంటే గొప్పవని రాజమౌళి అన్నారు. మీరు సినిమా చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని కామెరూన్‌తో ముచ్చటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మీరు అనలైజ్ చేయడం బాగుందన్నారు.
Here's Video
"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. ????
Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2
— RRR Movie (@RRRMovie) January 21, 2023
దీనికి కామెరూన్ స్పందిస్తూ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ స్టోరీ తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు. సినిమాలోని ట్విస్టులు, స్నేహితుల పాత్రలు మలిచిన విధానం అద్భుతమని కొనియాడారు. అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. మీరు అందించిన మ్యూజిక్ అద్భుతమన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 22, 2023 12:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

