RRR (Photo Credits: Twitter)

New York, JAN 18: అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆర్ఆర్ఆర్ (RRR) ఫిల్మ్ ఇర‌గ‌దీస్తోంది. ఆ ఫిల్మ్ వ‌రుస‌గా అవార్డుల‌ను గెలుచుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్స్‌(Golden globes), క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Award) అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు సియాటిల్ క్రిటిక్స్ (Seattle Critics Award) అవార్డును కూడా కైవ‌సం చేసుకున్న‌ది. బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కేట‌గిరీలో ఆ అవార్డు ద‌క్కింది. ఈ ఏడాదికి సంబంధించిన అవార్డుల‌ను జ‌న‌వ‌రి 17వ తేదీన ప్ర‌క‌టించారు. ప్రేమ్ ర‌క్షిత్‌ (Prem rakshith), దినేశ్ క్రిష్ణ‌న‌న్‌లు కొరియోగ్ర‌ఫీ చేయ‌గా, విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్‌, నిక్ పావెల్, రాయిచో వాసిలేవ్‌లు స్టంట్ కోఆర్డినేట‌ర్లుగా చేశారు. వారి పనితనానికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు RRR టీమ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌ లో ఈ అవార్డుకు సంబంధించిన వార్తను పంచుకుంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr. NTR), రాంచ‌ర‌ణ్ (Ram charan) న‌టించిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్‌.. ఆస్కార్స్ 2023లో మొత్తం 14 కేట‌గిరీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. అయితే జ‌న‌వ‌రి 24వ తేదీన ఆస్కార్స్ తుది నామినేష‌న్ల జాబితాను రిలీజ్ చేస్తారు. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో నాటునాటు పాట‌కు ఆస్కార్ ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 550 కోట్ల బ‌డ్జెట్‌తో తీసిన ఈ ఫిల్మ్‌ను రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే.