Jr NTR Corona Positive: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫ్యామిలీ అంతా ఐసోలేషన్‌లో ఉన్నామని తెలిపిన యంగ్ టైగర్, త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.
కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.కాగా తనకు కరోనా పాజిటివ్ అని జూనియర్ చేసిన ట్వీట్ పై కొద్దిసేపట్లోనే స్పందనలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు సందేశాలు పంపిస్తున్నారు.
ఎన్టీఆర్ ట్వీట్ చూసిన వారంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ.. జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని ఆయన అభిమానులు పూజలు జరుపుతున్నట్లుగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
Here's NTR Tweet
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021
కొన్ని రోజులుగా ఈయన బయటికి రావడం లేదు. నిజానికి కరోనా రాకముందు నుంచి కూడా ఈయన క్వారంటైన్‌లోనే ఉన్నాడు. తన స్టాఫ్‌లో కొందరికి పాజిటివ్ రావడంతో ఐసోలేట్ అయిపోయాడు జూనియర్. ఇప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రిపల్ ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ లైన్‌లో ఉన్నారు.
(The above story first appeared on LatestLY on May 10, 2021 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

