Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Hyderabad, Aug 13: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా (Kalki 2898 AD OTT) థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త ఇది. కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ రెండు ఓటీటీల్లో..
కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీలో, అమెజాన్ లో మిగతా భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.
ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో
(The above story first appeared on LatestLY on Aug 13, 2024 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

