kalki

Hyderabad, Sep 17: భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా కల్కీ-2898ఏడి (Kalki-2898AD). అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లీకుల (Leaks) బెడద తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ (Prabhas) ఫోటో ఒకటి లీకైంది. ఆ ఫోటో ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ నుండి లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయాన్ని కల్కీ టీమ్ సీరియస్‌ గా తీసుకుంది. అందులో భాగంగా వీఎఫ్ఎక్స్ కంపెనీపై లీగల్ కేసుని ఫైల్ చేయడమే కాక దీనికి బాధ్యత వహించాల్సిన విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా డిమాండ్ చేయాలని నిర్ణయించుకుందట.

PM Modi Birthday: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నేడు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యే పథకాలు ఇవే..వీటిలో మీకు ఏవి ఉపయోగపడతాయో ముందే తెలుసుకోండి..

భారీ తారాగణమే

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీలు నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

'Yashobhoomi' Inauguration: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్ట్.. తొలి దశకు ప్రధాని ప్రారంభోత్సవం.. వీడియోతో