Newdelhi, Sep 17: ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ గా, దేశంలోని అన్ని కన్వెన్షన్ సెంటర్ ల (Convention Center) కంటే చాలా పెద్దదిగా ప్రసిద్ధి చెంది.. ఢిల్లీలో (Delhi) రూ.5,400 కోట్ల భారీ బడ్జెట్ (Budget) తో నిర్మించిన తొలి దశ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ-IICC) ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం ప్రారంభించారు. దీనికే యశోభూమి అని నామకరణం చేశారు. అంతకుముందు యశోభూమి వరకు చేరుకునేందుకు వీలుగా ఉద్దేశించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎక్స్ టెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని, అదే మెట్రోలో ద్వారక స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కన్వెన్షన్ సెంటర్ ను 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియం సహా 15 కన్వెన్షన్ రూమ్ లు ఇక్కడ ఉన్నాయి. ఒక గ్రాండ్ బాల్ రూమ్, 13 సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. దీనికంటే ముందు రోజు యశోభూమిని ప్రధాని మెచ్చుకున్నారు.
VIDEO | PM Modi inaugurates the India International Convention and Expo Centre (IICC) - 'Yashobhoomi' - in Delhi's Dwarka. pic.twitter.com/xEYoMDMn91
— Press Trust of India (@PTI_News) September 17, 2023
At 11 AM tomorrow, 17th September, I will inaugurate Phase-1 of Yashobhoomi, a state-of-the-art and modern convention and expo centre in Dwarka, Delhi. I am confident this will be a very sought after destination for conferences and meetings. It will draw delegates from all around… pic.twitter.com/KktcRVRNqM
— Narendra Modi (@narendramodi) September 16, 2023
ప్లాటినమ్ సర్టిఫికేషన్
వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి గొప్ప ఆధునిక విధానం ఉందని, వర్షపు నీరు పొదుపునకు చర్యలు తీసుకున్న ఈ కాంప్లెక్స్ కు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినమ్ సర్టిఫికేషన్ వచ్చినట్టు మోదీ చెప్పారు. అంతకుముందు విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తి పని వారి ఆరాధ్య దైవం విశ్వకర్మ మహర్షికి ప్రధాని నివాళి అర్పించారు. పాదరక్షల కార్మికులతో ముచ్చటించారు.