Mumbai December 02: బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా-విక్కీ(Katrina-Vicky) పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే మ్యారేజ్(Marriage) కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌(Friends) కు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కత్రినా-విక్కీ(Katrina-Vicky) మొదట చట్టపరంగా వివాహం చేసుకోనున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం లేదా శుక్రవారం వీరు తమ పెళ్లిని రిజిస్టర్‌(Register marriage) చేయించుకోనున్నట్లు చెప్తున్నారు.

ఎలాంటి హడావుడి లేకుండా జరిగే ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే కత్రినా-విక్కీ(Katrina-Vicky)తోపాటు కుటుంబ సభ్యులందరూ రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌కి  వెళ్లనున్నారు. పెళ్లి, ఇతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకూ వివాహ వేదికను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేలా సదరు ఫోర్ట్‌ సిబ్బందితో ఈ జంట ఒప్పందం కుదుర్చుకున్నారని బీటౌన్‌(Bollywood)లో టాక్‌.

Bigg Boss 14: రేటు పెంచేసిన సల్మాన్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు, అక్టోబర్‌ నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 14..!

మరోవైపు పెళ్లికి సంబంధించిన అతిథుల విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. కత్రినా- విక్కీ పెళ్లికి సల్మాన్‌ ఖాన్‌(Salman Khan)తోపాటు ఆయన కుటుంబానికి కూడా ఆహ్వానం అందలేదట. కానీ సల్మాన్‌ చెల్లి అర్పితను కత్రినా పెళ్లికి ఆహ్వానించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అర్పిత స్పందిస్తూ.. ‘‘మాకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. మేము వెళ్లడం లేదు’’ అని సమాధానమిచ్చారు. సల్మాన్‌ఖాన్‌ - కత్రినా ఎన్నో సంవత్సరాల నుంచి మంచి స్నేహితులు. ఇప్పటికే వీరు పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. త్వరలోనే ‘టైగర్‌-3(Tiger-3)’ షూట్‌లో కూడా పాల్గొననున్నారు.