Maruthi Designs Duel Role For Prabhas: రాజాసాబ్ లో మారుతి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? ప్రభాస్ క్రేజీ లుక్ వెనుక ఉన్న రహస్యం ఇదే!
తాజాగా రాజాసాబ్‌కు సంబంధించిన వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. రాజాసాబ్‌లో ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. యంగ్ అండ్ ఓల్డ్ లుక్‌లో కనిపించనున్నాడట. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓల్డ్ మ్యాన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని జోరుగా టాక్ నడుస్తోంది.
Hyderabad, OCT 24: బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్ (Prabhas) కల్కి 2898 ఏడీ, సలార్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించిన ప్రభాస్ ఈ సారి రూటు మార్చి కామిక్ జోనర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ (raja saab) చేస్తున్నాడు ప్రభాస్. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా రాజాసాబ్‌కు సంబంధించిన వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. రాజాసాబ్‌లో ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. యంగ్ అండ్ ఓల్డ్ లుక్‌లో కనిపించనున్నాడట. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓల్డ్ మ్యాన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని జోరుగా టాక్ నడుస్తోంది. ఈ పాత్ర సినిమాను మరో లెవల్ తీసుకెళ్తుందంట. అంతేకాదు డైరెక్టర్ మారుతి ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం క్రేజీగా ఉండేలా డిజైన్ చేశారని ఇన్‌సైడ్ టాక్.
Prabhas Look In Raja Saab
ప్రభాస్ ఇప్పటికే బిల్లా, బాహుబలి ప్రాంచైజీలో డ్యుయర్ రోల్స్‌లో కనువిందు చేశాడని తెలిసిందే. రాజాసాబ్‌లో డ్యుయల్ రోల్ నిజమైతే అభిమానులను మాత్రం పండగే అని చెప్పొచ్చు. రాజాసాబ్ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లో 8.3 మిలియన్ల వ్యూస్ రాబట్టి నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ సరికొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 24, 2024 08:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

