Chiranjeevi Urban Monk Look: గుండు సీక్రెట్ బయటకు..మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు, అది మేకింగ్ వీడియో, అర్బన్ మాంక్ లుక్ పేరుతో వీడియో బయటకు
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య గుండుతో కనిపించిన విషయం విదితమే.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సరికొత్త లుక్‌లో (Chiranjeevi New Look) కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన చిరంజీవి ఆ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య గుండుతో కనిపించిన విషయం విదితమే.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సరికొత్త లుక్‌లో (Chiranjeevi New Look) కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన చిరంజీవి ఆ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
పలువురు చిరంజీవి న్యూలుక్ సూపర్ అంటూ స్పందించారు. అయితే తాజాగా విడుదలయిన వీడియోతో చిరు గుండు వెనుక ఉన్న అసలు నిజం బయటపడిపోయింది. చిరు ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకొని ఉంటారని అందరూ భావించారు. అయితే చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్ మాంక్’ మేకింగ్ వీడియోని (Urban Monk Making Video) చూసేయండి. సో అదన్న మాట చిరంజీవి గుండు రహస్యం.
Here's Video
Secret Behind Chiru Gundu
— RajaReddy (@RajaReddyAB) September 15, 2020
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ (Aacharya) సినిమా చేస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చిరంజీవి ఓ వైపు ఆచార్య సినిమా చేస్తూనే పలువురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు.
ఆచార్య ఫస్ట్ లుక్
Here it is ..#Acharya pic.twitter.com/QC9Jxqyy0c
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2020
మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ఆ తర్వాత ఇద్దరు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు. అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి.. ఏ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళతాడా అనే సందిగ్ధం నెలకొని ఉండే. తాజాగా ఆ అనుమానాలకు తెరదించుతూ.. చిరంజీవి.. తన నెక్ట్స్ మూవీని తన కజిన్.. మెహర్ రమేష్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందివ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే మహతి ఇచ్చిన ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే చిరంజీవి కూడా తన నెక్ట్స్ మూవీకి మహతిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ క్యారెక్టర్‌ను ఎవరైనా స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ సినిమాకు సరిపోతుంది. అందుకే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రకు రౌడీ బేబి సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు.హీరోయిన్‌గా నయనతార పేరును పరిశీలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 15, 2020 03:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

