chiranjeevi-new-look-leaked-from-koratala-siva-movie-and-it-goes-viral-in-social-media (Photo-Social media)

ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఒకవైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే తన అభిమానులకు కావాల్సినంత ఫన్‌ అందిస్తున్నాడు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి స్టెప్పులేసిన వీడియోను (Chiranjeevi Dance Video) తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.  ఆ మహిళ మా అమ్మకాదు, సమాజసేవలో మెగాస్టార్ తల్లి కథనంపై వివరణ ఇచ్చిన చిరంజీవి, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ పొగడ్తలు

గతేడాది 1980 యాక్టర్స్ కలిసిన వేళ హీరోయిన్స్ సుహాసిని, రాధ, ఖుష్బూలతో పాటు జయప్రదలతో చేసిన డాన్స్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ మూమెంట్స్ చేసారు. ఆ తర్వాత చిరు రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు రిథమ్ కలిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ తదితరులు స్టెప్పులు వేసారు. ఇపుడీ వీడియోను చిరు తన సోషల్ మీడియా అకౌంట్‌ ట్విట్టర్ (Twitter) లో పోస్ట్ చేసారు.

Here's Chiru Dance Video 

అయితే గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది. ఈ రియూనియన్‌ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి