Kubera: కుబేర‌లో నాగార్జున ఫ‌స్ట్ లుక్ అదుర్స్! అంచ‌నాలు అమాంతం పెంచేసిన నాగార్జున ఇంట్రో టీజ‌ర్

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కుబేర‌ (Kunera). ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

Kubera: కుబేర‌లో నాగార్జున ఫ‌స్ట్ లుక్ అదుర్స్! అంచ‌నాలు అమాంతం పెంచేసిన నాగార్జున ఇంట్రో టీజ‌ర్
Nagarjuna Akkineni in kubera (PIC@ X)

Hyderabad, May 02: శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కుబేర‌ (Kunera). ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా గురువారం నాగార్జున లుక్‌ను రివీల్ చేశారు. ఓ కంటెన‌ర్ లారీలో పెద్ద మొత్తంలో డ‌బ్బు ఉండ‌గా.. వ‌ర్షంలో గొడుగు ప‌ట్టుకుని క‌ళ్ల‌ద్దాల‌తో ఉన్న‌ నాగార్జున ఆ మ‌నీని చూస్తూ ఉంటాడు. ఆ డ‌బ్బును అక్క‌డే వ‌దిలేసి ముందుకు వ‌స్తుండ‌గా.. రోడ్డు పై ఉన్న నోటు పై అడుగువేయ‌బోయి ఆగిపోతాడు. ఆ ప‌క్క‌నే ఉన్న మ‌రో కంటైన‌ర్‌లోనూ డ‌బ్బు ఉండ‌గా.. త‌న ప‌ర్సులోంచి కొంత డ‌బ్బును తీసి దానిలో వేస్తాడు.

మిడిల్ ఏజ్ లుక్‌లో నాగార్జున క‌నిపిస్తున్నాడు. మొత్తంగా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని గ‌డ్డంతో ఉన్న నాగార్జున లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ర‌ష్మిక మందాన్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

(The above story first appeared on LatestLY on May 02, 2024 08:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).