Naresh on Children: పిల్లలు కనేందుకు మేమిద్దరం శారీరకంగా ఫిట్‌గా ఉన్నాం, నరేశ్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, బ్లడ్ రిలేషన్‌షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పదని వెల్లడి
నరేశ్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెల 26న విడుదలైంది కూడా. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు ఈ సినిమాకు. అయితే పిల్లలు కనడంపై ఈ జంట చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

నరేష్ మాట్లాడుతూ.. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్ అంటున్నాడు. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నామని చెప్పారు. ‘ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం.
నా దృష్టిలో బ్లడ్ రిలేషన్‌షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది. కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేంది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్ చెప్పుకొచ్చాడు.
(The above story first appeared on LatestLY on May 30, 2023 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).