Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??
Niharika (Credits: Twitter)

Hyderabad, May 7: అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 1 (Pushpa 1) విజయంతో ‘పుష్ప 2 ది రూల్’పై (Pushpa 2) అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ మూవీలో మెగా డాటర్ నిహారిక (Niharika) నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. నిహారిక ఈ సినిమాలో గిరిజన అమ్మాయిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఊహించని లుక్‌లో కనిపించనుందని, కొన్ని సాహసాలు కూడా చేయనుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె తిరస్కరించిందట. దీంతో ఈ పాత్రకు నిహారికను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Music University In Telanagana: దేశంలోనే తొలి మ్యూజిక్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు, ఇళయరాజా అంగీకరిస్తే ప్రారంభిస్తామన్న కేటీఆర్

ఏమిటా పాత్ర?

ఈ సినిమాలో గిరిజన అమ్మాయిగా కనిపించనున్న నిహారిక పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నది. గిరిజన యువతిగా పుష్పరాజ్ పక్కనే ఉంటూ పోలీసులకు సమాచారం ఇస్తుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో కొన్నిరోజులు ఆగితే గానీ తెలియదు.