Thalapathy Vijay Denounces CAA: సీఏఏని వ్యతిరేకించిన తమిళ హీరో దళపతి విజయ్, స్టాలిన్ సర్కారు అమలుచేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలంటూ ప్రకటన
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ దళపతి విజయ్ స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని Thalapathy Vijay డిమాండ్ చేశారు.
- Read in
- తెలుగు
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ దళపతి విజయ్ స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని Thalapathy Vijay డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చట్టాన్ని అమలుచేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ ప్రకటించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీనిపై స్పందిస్తామని ఆమ్ ఆద్మీ తెలిపింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.వివాదాస్పద ఎన్నికల బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ వివాదాస్పద చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ మండిపడ్డారు. ఐదేళ్లపాటు పెండింగులో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడం ఏంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Here's Tweet
#CitizenshipAmendmentAct pic.twitter.com/4iO2VqQnv4
— TVK Vijay (@tvkvijayhq) March 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 12, 2024 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

