కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ... ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని... అయితే, సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది. వీడియో ఇదిగో, సెక్స్ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..
పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై 'మా' ఇంకా స్పందించకపోయినా... ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో? ఎందుకు ఫిర్యాదు చేసిందో? ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే... ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు.
Here's Tweet
Had maa association taken complaint on trivikram Srinivas ,
I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024
పూనమ్ ఫిర్యాదును 'మా' తమకు ఫార్వర్డ్ చేసినా... తాము ఆ అంశంపై విచారిస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో ఓ బాక్స్ ఉంటుందని... ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. లేదా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, సినీ నటి పూనమ్ కౌర్ కు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉన్న సంగతి విదితమే.