Prabhas 'Salaar' Postponed: ప్రభాస్ సలార్ వాయిదా, విదేశాలకు చెక్కేస్తున్న డార్లింగ్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపిన మేకర్స్

ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి.

Prabhas 'Salaar' Postponed: ప్రభాస్ సలార్ వాయిదా, విదేశాలకు చెక్కేస్తున్న డార్లింగ్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపిన మేకర్స్
Salar

ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భుతమైన సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు మా టీమ్‌ అవిశ్రాంతంగా పని చేస్తోంది. సలార్‌కు ఫైనల్‌ టచ్‌ ఇస్తున్నాం. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం' అని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌ ట్వీట్‌ చేసింది.

నటుడు శ్రీకాంత్ బూమ్ బూమ్ బీర్ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వీడియోపై పేలుతున్న సైటైర్లు

సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో భాగంగా సలార్‌: పార్ట్‌ 1- సీజ్‌ ఫైర్‌ను ఈ నెలలో విడుదల చేస్తామన్నారు. కానీ అంతలోనే చిత్రాన్ని వాయిదా వేశారు. గ్రాఫిక్స్‌ పనులు పూర్తి కాకపోవడం వల్లే ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక సలార్‌ వాయిదా పడడంతో ప్రభాస్‌ విదేశీ ట్రిప్‌ వేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల తర్వాత తిగిరి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం.

Here's News

బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో ప్రభాస్‌కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది.ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది.

(The above story first appeared on LatestLY on Sep 13, 2023 03:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).