Pushpa 2 Teaser Video: అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్, పుష్ప 2 టీజర్ వచ్చేసింది, పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థమంటూ.
పుష్ప 2 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ బృందం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
పుష్ప 2 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ బృందం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
ఎనిమిది బుల్లెట్లు తగిలిన గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ టీజర్ మొదలైంది. పుష్ప చనిపోయాడంటూ ప్రచారం చేస్తున్నట్టుగా టీజర్ మొదలైంది. ఇక సడెన్‌గా అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్ అలా నడుస్తూ వెళుతున్న వీడియో ఉత్కంఠ పెంచుతోంది.
‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం. మొత్తానికి ఎంతోకాలంగా పుష్ప 2 అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ టీజర్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు సుకుమార్.
Here's Video
కాగా ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
(The above story first appeared on LatestLY on Apr 07, 2023 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

