Pushpa First Look: మనసుల్ని దోచేసే స్మగ్లర్.. 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అదరగొట్టిన స్టైలిష్ స్టార్! అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఫ్యాన్స్‌కి దమాఖా గిఫ్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్
ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ లుక్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. అల్లు అర్జున్ మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఒక మూలన కూర్చుని పదునైన కళ్లతో క్రూరంగా చూస్తూ ఉండగా అతడి చుట్టూ......
#HappyBirthdayAlluAjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ (Stlish Star) అభిమానులందరికీ ఈరోజు లాక్డౌన్ బద్దలుగొట్టుకొని బయటకు వచ్చినంత ఆనందం, జోష్ లభించినట్లయింది. కారణం ఈరోజు 2020 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప' ఫస్ట్ లుక్ (Pushpa First Look) పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకేరోజు రెండు పోస్టర్లు విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేయడం అనేది ఫ్యాన్స్‌కు డబుల్ దమాఖా గిఫ్ట్ అనే చెప్పాలి.
ఈ ఏడాది విడుదలైన 'అల వైకుంఠపురములో' ఫ్యామిలీ డ్రామా బన్నీ కెరియర్‌లో మరొక హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు పూర్తి విరుద్ధమైన జోనర్లో అల్లు అర్జున్ 20వ సినిమా పుష్ప రాబోతుంది. ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య (2004) మరియు ఆర్య 2 (2009) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడో చిత్రం పుష్ప ఒక ఒక హై-ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ లుక్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. అల్లు అర్జున్ మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఒక మూలన కూర్చుని పదునైన కళ్లతో క్రూరంగా చూస్తూ ఉండగా అతడి చుట్టూ పోలీసులను, కొన్ని ఎర్రచందనం దుంగలను గమనించవచ్చు.
Check Out The Poster Of Allu Arjun's Pushpa Below:
First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq
— Allu Arjun (@alluarjun) April 8, 2020
ఈ సినిమాలో పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. చిత్తూరు అడవుల్లో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని వినికిడి. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర స్మగ్లర్ అని టాలీవుడ్ టాక్.
హీరోయిన్‌గా రష్మిక మందనా (Rashmika Mandanna) నటిస్తుండగా, విలన్ పాత్రలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కనిపించనున్నట్లు సమాచారం. కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ 5 భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి కొనసాగనుంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 08, 2020 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

