Klin Kaara konidela: రాంచరణ్ కూతురు పేరు వెనుక ఇంత అర్థం దాగుందా, క్లిన్ కారా కొణిదెల పేరు రహస్యాన్ని బయటపెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్- ఉపాసన కామినేని కుమార్తె పేరును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. మీడియా ద్వారా 'మెగా డాటర్' అని పిలవబడే చిన్నారికి అధికారికంగా క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు.బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు.

Klin Kaara konidela: రాంచరణ్ కూతురు పేరు వెనుక ఇంత అర్థం దాగుందా, క్లిన్ కారా కొణిదెల పేరు రహస్యాన్ని బయటపెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి
Klin Kaara konidela

రామ్ చరణ్- ఉపాసన కామినేని కుమార్తె పేరును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. మీడియా ద్వారా 'మెగా డాటర్' అని పిలవబడే చిన్నారికి అధికారికంగా క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు.బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని తాత అయిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక సీక్రెట్ కూడా ఆయనే బయటపెట్టారు.

చెంచు గిరిజన దేవత భావమ్మ దేవి ఆశీస్సులతో, మేము మా ప్రియమైన మనవరాలు క్లిన్ కారా కొణిదెలను పరిచయం చేస్తున్నామంటూ నోట్‌పై రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు అనిల్, శోభన సంతకాలు చేశారు.

క్లిన్ కారా కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఇదే, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు కన్ఫర్మ్

రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్- ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన 11 ఏళ్లకు అంటే గతేడాది ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ‍్చింది. ఆ తర్వాత కూడా ఉపాసన బేబీ బంప్ తో చాలాసార్లు బయట కనిపించింది. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది.

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 05:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).