Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల

తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల

Hyderabad, March 27: మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) గతేడాది సెప్టెంబర్‌లో బైక్ యాక్సిడెంట్‌లో (Bike accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో బైక్ స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలపాలపైన తేజును, వెంటనే స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి, ఆ తరువాత అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాస్త కోలుకున్న తరువాత తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వారు చూపించిన ప్రేమతోనే తాను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నానంటూ తేజు చెప్పుకొచ్చాడు. ఇక తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నట్లు తేజు తెలిపాడు.

ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని.. సుకుమార్(Sukumar), బాబీలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తేజు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మళ్లీ అందరి ముందుకు వస్తానని తేజు పేర్కొన్నాడు. ఇక బైక్‌పై వెళ్లే ప్రతిఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Sai Dharam Tej's Health Update: వెంటిలేటర్‌పై హీరో సాయి ధరమ్ తేజ్, అభిమానులు ఆందోళన చెందవద్దని ట్వీట్ చేసిన హీరో చిరంజీవి, అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స

అయితే ఈ వీడియోలో తేజు ఇంకా నీరసంగానే కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరో ప్రమాదం నుండి కోలుకోవడం సంతోషంగా ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Aadhi Engaged to Nikki Galrani: ఆ హీరో, హీరోయిన్ల పెళ్లి ఖరారు! ఓ ఇంటివాడు కాబోతున్న ఆదిపినిశెట్టి, అట్టహాసంగా ప్రియురాలితో నిశ్చితార్ధం, అక్కకు పెళ్లికాకుండానే మ్యారేజ్ చేసుకుంటున్న కన్నడ బ్యూటీ

సాయిధరమ్ తేజ్ గత మూవీ రిపబ్లిక్ (Republic)ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. ఆయనకు యాక్సిడెంట్ అయిన మరుసటిరోజే ఈ మూవీ రిలీజ్ అయింది. దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది.

(The above story first appeared on LatestLY on Mar 27, 2022 12:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).