Sai Dharam Tej's Health Update: వెంటిలేటర్‌పై హీరో సాయి ధరమ్ తేజ్, అభిమానులు ఆందోళన చెందవద్దని ట్వీట్ చేసిన హీరో చిరంజీవి, అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
Sai Dharam Tej (Photo Credits: Instagram)

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స (Sai Dharam Tej's Health Update) కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌కు చికిత్స (Sai Dharam Tej's health, condition) కొనసాగుతోంది. ప్రయాణానికి ముందు సాయి ధరమ్‌ తేజ్‌ ఆహారం తినడంతో.. ప్రమాద వల్ల పుడ్‌పైప్‌ నుంచి ఊపిరితిత్తుల పైప్‌ వరకు ఆహారం చేరింది. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు రాత్రి తొలగించారు.

ప్రమాదం వల్ల ఒత్తిడికి గురైన సాయిధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) కుడివైపు ఊపిరితిత్తులు జీసీఎస్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. మరో గంటలో అపోలో వైద్యుల బృందం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనేదానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు.

ఇక తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సాయి ఆరోగ్యం గురించి తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌కు స్వల్పగాయాలయ్యాయని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు.

Here's Chiru Tweet

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డారు. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోయారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నిహారిక, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు సందీప్‌ కిషన్‌ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

బిగ్ బాస్ విజేత కన్నుమూత, గుండెపోటుతో మరణించిన ప్రముఖ హిందీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న బీటౌన్

ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు. అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ క్షేమంగా ఉన్నాడని తెలిపారు. మరోవైపు సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయి తేజ్‌ గురించి ట్వీట్లు పెడుతున్నారు. ‘బ్రదర్‌ సాయిధరమ్‌తేజ్‌.. త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్‌ అన్నారు. రవితేజ, నిఖిల్‌, మంచు మనోజ్‌, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు సైతం తేజ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.