Cara Winhold with her children (Photo-Twitter)

అమెరికాలో ఓ తల్లి గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయం డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కారా విన్‌హోల్డ్ వయసు 30 సంవత్సరాలు. 2018లో ఈ దంపతులకు తొలి సంతానం కలిగింది. ఆ తర్వాత మూడుసార్లు కారాకు గర్భస్రావం జరిగింది. మూడోసారి గర్భస్రావం సమయంలో ఆమె కూడా చనిపోయినంత పనైంది. ‘‘దాంతో మళ్లీ గర్భం దాల్చాలంటేనే భయమేసింది’’ అని కారా ఆ అనుభవాలను గుర్తు చేసుకుంది. అలాంటి ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నెల (Woman who fell pregnant) తప్పింది. నెల రోజుల తర్వాత మరోసారి తీసిన స్కానింగ్‌లో రెండో పిండం ( already pregnant) కూడా కనిపించింది.

అది చూసిన కారా షాకైపోయింది. ‘‘అదేంటి? మొదటి సారి స్కానింగ్‌లో రెండో బిడ్డ లేడు కదా?’’ అని డాక్టర్లను అడిగింది. ఆమె రెండు అండాలను విడుదల చేసి ఉంటుందని, అయితే ఆ రెండూ ఒకేసారి ఫలదీకరణం చెందలేదని డాక్టర్లు అన్నారు. దాదాపు ఒక వారం తేడాతో రెండు అండాలు పిండాలుగా మారాయి. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతున్నారని తెలిసి ఆమె సంతోషించింది.

ఎంత కష్టమొచ్చిందో.. 4 నెలల పిండాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టిన తల్లి, ఆస్పత్రిలో తమ బిడ్డ అవశేషాలను చెత్తలా చూశారని ఆవేదన, దర్యాప్తు ప్రారంభించిన యూనివర్సిటీ ఆస్పత్రి

ఇప్పుడు ఆమెకు డెలివరీ కూడా జరిగింది. ఆరు నిమిషాల తేడాతో పుట్టిన కవలలు (birth to twins) ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. వాళ్లను చూసిన కారా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ఆమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.